పినపాక నియోజకవర్గం గౌడ సంఘం సమావేశం ఏజెన్సీలో ఉన్న గౌడ కులస్తులకి సొసైటీ లను పునరుద్ధరించాలి

పినపాక నియోజకవర్గం గౌడ సంఘం సమావేశం ఏజెన్సీలో ఉన్న గౌడ కులస్తులకి సొసైటీ లను పునరుద్ధరించాలి

మణుగూరు, అక్టోబర్ 18 జై తెలంగాణా న్యూస్, మణుగూరు మండలం లోని స్నేహ గార్డెన్స్ లో శుక్రవారం నాడు పినపాక నియోజకవర్గం గౌడ సంఘం సమావేశం మేకపోతుల వెంకటేశ్వర్లు గాడ్ అధ్యక్షతన జరిగింది ఈ సంఘము సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం లో గౌడ కులస్తులు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు తాటి చెట్టు ఎక్కుతున్న తరుణము, లో ప్రతి ఒక్కరు తాటి చెట్టు ఎక్కుతున్న గోడకులస్తులకి ఎటువంటి ఆధారం లేకుండా కుల వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అదేవిధంగా, నియోజకవర్గంలోని గీత కార్మికులందరికీ కాటమయ్య కవచం కిట్టు ను ఇస్తున్న నేపథ్యంలో కానీ గౌడ వృత్తిని నమ్మి వృత్తిని చేసుకుంటున్న కానీ ఎటువంటి ఆదరణ లేకుండా పోయిందని గౌడ కులస్తులకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాటి చెట్టు ఎక్కుతూ బతుకు జీవనం సాగిస్తున్నారు కానీ ఏజెన్సీలో నివసిస్తున్న గౌడ కులస్తులు కనీసం తాటి చెట్టు నుంచి క్రింద పడితే పడితే ఎటువంటి నష్ట పరిహారం అందటం లేదు అని ఆవేదన చెందుతున్నారు నియోజకవర్గంలోని గతంలో గీత కార్మికులకు సొసైటీలో ఉండేటివి కానీ ఇప్పుడు గౌడులు కులవృత్తిని నమ్ముతూ జీవన సాగిస్తున్న గౌడ కులస్తులు జీవితాలు దుర్భారంగా, ఇబ్బందులకు లోనై మనోవేదనకు గురి అవుతున్నారు సొసైటీ లేకపోవడం వలన ప్రమాదం జరిగితే ఎటువంటి ఆదరణ లేక చాలా రకాల ఇబ్బందులు. ఏర్పడుతూ జీవన సాగి స్తున్నారు కనుక ప్రభుత్వాలు గౌడ కులస్తులు ఏజెన్సీలో ఏజెన్సీలో ఉన్నటువంటి గౌడులకు 1950 56  చట్టం ప్రకారం 342 5 2014 ,2015 ప్రకారం మా గౌడు కులస్తులందరూ కూడా. ఎస్టీ జాబితాలో కలిపి ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని అదేవిధంగా ఏజెన్సీ లో ఉన్న సొసైటీని పునరుద్ధరణ చేసి సొసైటీలు ఇప్పించి గౌడ కులుస్తులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గంలోని గుండల మర్కోడు పినపాక జానంపేట మణుగూరు మండల నాయకులు బూర వెంకటేశ్వర్లు గౌడ్, బూర సోమనసయ్య గౌడ్ ,కొంపెల్లి మల్లేష్ గౌడ్, చేగొని రమేష్ గౌడ్ పొడి సెట్టి రాములు గౌడ్, మేకపోతుల నరసింహారావు గౌడ్, శ్రీరామ్ సమయ గౌడ్, బత్తిని సాయన్న గౌడ్, వీరగాని సమ్మయ్య గౌడ్, నలమాస భిక్షమయ్య గౌడ్, చేగోని చటర్జీ గౌడ్ రావుల సమ్మయ్య గౌడ్, వెంకన్న గౌడ్ చీకటి బిక్షపతిగౌడ్ గునిగంటి నిమ్మయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *